Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'హిందూ ఫోబియా'పై బిల్లు తీసుకువచ్చిన తొలి అమెరికా రాష్ట్రం ఇదే!

Georgia Becomes First US State to Introduce Anti Hinduphobia Bill
Advertisement
  • పలు అమెరికా రాష్ట్రాల్లో హిందువులపై వ్యతిరేకత
  • ఇకపై జార్జియా రాష్ట్రంలో హిందువులపై వివక్ష ప్రదర్శించడం నేరం
  • చట్టపరమైన చర్యలకు బిల్లు ద్వారా అవకాశం
Advertisement
అమెరికాలోని జార్జియా రాష్ట్రం ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. హిందువులపై వ్యతిరేకతను (హిందూ ఫోబియా) నేరంగా పరిగణించే బిల్లును ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా నిలిచింది. ఈ చట్టం ద్వారా... హిందువులపై జరిగే వివక్షను నేరంగా పరిగణించి, చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కలుగుతుంది.

రిపబ్లికన్ సెనేటర్లు షాన్ స్టిల్, క్లింట్ డిక్సన్, డెమోక్రటిక్ సెనేటర్లు జాసన్ ఎస్టెవ్స్, ఇమాన్యుల్ డి జోన్స్ సంయుక్తంగా ఎస్బీ-375 బిల్లును ఆమోదించారు. ఈ బిల్లు 'హిందూఫోబియా'ను అంతం చేయడానికి ఉద్దేశించబడింది అని కోలిషన్ ఆఫ్ హిందూస్ ఇన్ నార్త్ అమెరికా ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ సందర్భంగా ఒక ప్రకటన చేస్తూ, జార్జియా రాష్ట్రం ఎస్బీ-375 బిల్లును ప్రవేశపెట్టిందని, ఇది హిందూఫోబియా మరియు హిందూ వ్యతిరేక వివక్షను గుర్తించడానికి రాష్ట్ర శిక్షాస్మృతిని సవరిస్తుందని తెలిపింది. దీని ద్వారా, హిందూ వ్యతిరేకతను గుర్తించి, తగిన చర్యలు తీసుకోవడానికి వీలు కలుగుతుందని వివరించింది. ఈ బిల్లును జార్జియాలోని హిందువుల రాజకీయ కార్యవర్గం కూడా సమర్థించింది.

ఈ బిల్లు ద్వారా... రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సాధారణ నిబంధనలు, జాతి, రంగు, మతం లేదా జాతీయ మూలం ఆధారంగా వివక్షను నిషేధించే చట్టాలు మరియు నిబంధనలకు హిందూఫోబియా నిర్వచనాన్ని వర్తింపజేయడానికి కొన్ని ప్రభుత్వ సంస్థలకు అధికారం లభిస్తుంది. 

Advertisement
Advertisement
Georgia
Hinduphobia Bill
Anti-Hindu Discrimination
SB-375
US Legislation
Hate Crime
Religious Discrimination
Shaun Still
Clint Dixon
Jason Esteves
Emmanuel Jones

More Telugu News